శనివారం 28 నవంబర్ 2020
International - Oct 24, 2020 , 12:31:42

ప్రమాదకరమైన మార్గంలో దేశాలు : ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రమాదకరమైన మార్గంలో దేశాలు : ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా : ప్రపంచం ఇప్పుడు కొవిడ్‌ మహమ్మారిలో క్లిష్టమైన దశలో ఉందని, కొన్ని దేశాలు ప్రమాదకరమైన మార్గంలో పయనిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ అన్నారు. ముఖ్యంగా ఉత్తరార్ధగోళంలో కిష్టమైన దశలో ఉన్నామని పేర్కొన్నారు. ఇప్పటికే హాస్పిటళ్లు జనాలతో నిండిపోయాయని పేర్కొన్నారు. ఇంకా అక్టోబర్‌లోనే ఉన్నామని, రాబోయే కొద్ది నెలలు చాలా కఠినంగా ఉంటాయన్నారు. మరింత ప్రాణనష్టం జరుగకుండా వెంటనే కఠిన చర్యలు తీసుకొని అవసరమైన ఆరోగ్యసేవలు కూలిపోకుండా, విద్యాసంస్థలను మళ్లీ మూసివేయాల్సిందిగా ఆయా దేశాల నేతలను కోరారు. మహమ్మారి కట్టడికి ఆయా దేశాలు విచక్షణాయుతంగా చర్యలు తీసుకోవాలని ఫిబ్రవరిలోనే చెప్పానని, మరోసారి పునరావృతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. చాలా దేశాలు ఇప్పుడు అంటువ్యాధుల పెరుగుదలను చూస్తున్నాయని టెడ్రోస్‌ తెలిపారు. వైరస్‌ వ్యాప్తిని త్వరగా పరిమితం చేసేందుకు దేశాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షలను మెరుగుపరచడం, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ఐసోలేషన్‌ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయడం ద్వారా గట్టెక్కవచ్చని, లాక్‌డౌన్లను నివారించవచ్చని టెడ్రోస్‌ పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.