శనివారం 04 ఏప్రిల్ 2020
International - Feb 09, 2020 , 16:31:06

కిల్లర్‌ కమాండోను హతమార్చిన ఆర్మీ

కిల్లర్‌ కమాండోను హతమార్చిన ఆర్మీ

పోలీసులు, ఆర్మీ నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి సార్జెంట్‌ జాక్రాపంత్‌ను కాల్చి చంపారు.

బ్యాంకాక్‌:  థాయ్‌లాండ్‌లోని నఖోన్‌ రాచసీమ నగరంలో  విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మంది అమాయకుల మరణానికి కారణమైన జవాన్‌ జాక్రాపంత్‌ థొమ్మాను భద్రతా దళాలు హతమార్చాయి.   ఆదివారం ఉదయం పోలీసులు, ఆర్మీ   సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి సార్జెంట్‌ జాక్రాపంత్‌ను  కాల్చి చంపారు.  జక్రాపంత్‌ ఉన్న మాల్‌ను చుట్టిముట్టి అతడిని అంతమొందించినట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను థాయ్‌లాండ్‌ ప్రధాని ప్రయుత్‌ చాన్‌-ఓచా పరామర్శించారు. సైనికుడి కాల్పుల్లో మొత్తం 26 మంది మృతి చెందగా 57 మంది గాయపడ్డారు. logo