శనివారం 24 అక్టోబర్ 2020
International - Sep 30, 2020 , 12:49:55

శిక్ష‌ణ‌లో భాగంగా భ‌వ‌నం మీద నుంచి కింద ప‌డ్డ సైనికుడు!

శిక్ష‌ణ‌లో భాగంగా భ‌వ‌నం మీద నుంచి కింద ప‌డ్డ సైనికుడు!

ఎలాంటి సాహ‌సాల‌కైనా కేరాఫ్ అడ్ర‌స్‌గా సైనికులు నిలుస్తారు. మ‌రి అంత ధైర్యంగా ఎదుర్కొంటున్నారంటే వారికి ఏ లెవ‌ల్‌లో శిక్ష‌ణ ఇస్తున్నారో చూస్తే భ‌య‌ప‌డుతారు. అమ్మో.. అని సగం చ‌స్తారు. అంత క‌ఠినంగా ఉంటుంది ట్రైనింగ్‌. అన్నీ ఎదుర్కొని నిలిస్తేనే సైనికుడిగా నిల‌బ‌డ‌తాడు. ఈ ట్రైనింగ్‌తో వారు చాలా స్ట్రాంగ్‌గా త‌యార‌వుతార‌ని చెప్పొచ్చు. ఈ శిక్ష‌ణ వారికి ఎప్పుడూ ఉంటుంది. అయితే ట్రైనింగ్‌‌లో భాగంగా ఒక సైనికుడు తాడు క‌ట్టుకొని భ‌వ‌నం మీద నుంచి కింద‌కి దూకాడు. పాపం అదుపు త‌ప్పి ఆ సైనికుడు నేల మీద ప‌డి గాయాల‌పాల‌య్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. జై జ‌వాన్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 

 


logo