సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Jul 17, 2020 , 13:04:37

సూర్యుడు అతిస‌మీపంగా ఇలా.. సోలార్ ఆర్బిటార్ ఫోటోలు రిలీజ్‌

సూర్యుడు అతిస‌మీపంగా ఇలా.. సోలార్ ఆర్బిటార్ ఫోటోలు రిలీజ్‌

హైద‌రాబాద్‌: సూర్యుడిని అతి స‌మీపంగా చూస్తే ఎలా ఉంటాడో.. ఆ ఫోటోల‌ను సోలార్ ఆర్బిటార్ రిలీజ్ చేసింది.  నాసాకు చెందిన సోలార్ ఆర్బిటార్ తొలిసారి సూర్యుడి ఫోటోల‌ను అత్యంత స‌మీపంగా తీసింది.  యురోపియ‌న్ స్పేస్ ఏజెన్సీ, నాసాలు సంయుక్తంగా సోలార్ ఆర్బిటార్ ప్రాజెక్టు చేప‌ట్టాయి. సూర్యుడి అధ్య‌య‌నం కోసం ఆ ప్రాజెక్టు చేప‌ట్టారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 9న వ్యోమ‌నౌక ద్వారా సోలార్ ఆర్బిటార్‌ను ప్ర‌యోగించారు.  అది జూన్ నెల మ‌ధ్య‌లో సూర్యుడికి అతిస‌మీపంగా వెళ్లిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. 

ఇంత స‌మీపంగా తీసిన సూర్యుడి ఫోటోల‌ను గ‌తంలో ఎప్పుడూ చూడ‌లేని, ఆ ఫోటోలు అసాధార‌ణంగా ఉన్నాయ‌ని నాసా ప్రాజెక్టు శాస్త్ర‌వేత్త హోలీ గిల్బ‌ర్ట్ తెలిపారు. ఈ ఫోటోల ఆధారంగా సూర్యుడి ఉప‌రిత‌ల వాతావ‌ర‌ణాన్ని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేయ‌నున్నారు. దీని ఆధారంగా భూమితో పాటు సౌర‌వ్య‌వ‌స్థ‌లో సూర్యుడి ప్ర‌భావాన్ని అధ్య‌య‌నం చేసే వీలు అవుతుంద‌న్నారు. సోలార్ ఆర్బిటార్‌లో మొత్తం ఆరు ఇమేజింగ్ ప‌రిక‌రాలు ఉన్నాయి. అవ‌న్నీ సూర్యుడి ఒక్కొక్క కోణాన్ని స్ట‌డీ చేయ‌నున్నాయి. 

ఎక్స్‌ట్రీమ్ ఆల్ట్రావాయిలెట్ ఇమేజ్‌లో.. సూర్యుడి అధ్య‌యనం కొత్త‌గా ఉన్న‌ట్లు నాసా శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు.  ఈయూఐ చిత్రాల్లో క్యాంప్‌ఫైర్స్ క‌నిపిస్తున్న‌ట్లు ఖ‌గోళ‌శాస్త్ర‌వేత్త డేవిడ్ బెర్గ్‌మాన్స్ తెలిపారు. సూర్యుడిలో ఉంటే సోలార్ ఫ్లేర్స్‌కు చెందిన‌వే క్యాంప్‌ఫైర్స్ అని, అయితే అవి ల‌క్ష‌లు లేదా కోట్ల సంఖ్య‌లో ఉంటాయ‌న్నారు. హై రెజ‌ల్యూష‌న్ ఈయూఐ ఇమేజ్‌ల‌ను ప‌రిశీలిస్తే, క్యాంప్‌ఫైర్లు అంత‌టా కనిపిస్తున్నాయ‌న్నారు. సూర్యుడిలోని నానోఫ్లేర్స్‌ను కూడా త్వ‌ర‌లో అధ్య‌య‌నం చేయ‌నున్న‌ట్లు సైంటిస్టు బెర్గ్‌మాన్స్ తెలిపారు.
logo