గురువారం 01 అక్టోబర్ 2020
International - Sep 09, 2020 , 14:47:29

ఒకే ద‌గ్గ‌ర ఆరుగురి క‌న్నా ఎక్కువ ఉండొద్దు..

ఒకే ద‌గ్గ‌ర ఆరుగురి క‌న్నా ఎక్కువ ఉండొద్దు..

హైద‌రాబాద్‌: సామాజిక క‌ల‌యిక‌ల‌పై ఇంగ్లండ్ ప్ర‌భుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఆరుగురి క‌న్నా ఎక్కువ మంది ఒకే ద‌గ్గ‌ర గుమ్మికూడ‌ద‌న్న నియ‌మావ‌ళి విధించింది. సోమ‌వారం నుంచి ఈ కొత్త నిబంధ‌న‌లు అమ‌లు కానున్నాయి. ఇటీవ‌ల మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదు కావ‌డంతో ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ది. అయితే ఒక‌వేళ  ఎవ‌రైనా నిబంధ‌న ఉల్లంఘిస్తే,  వారికి భారీ జ‌రిమానా విధించ‌నున్నారు. స్కూళ్లు, ప‌నిప్ర‌దేశాలు, పెళ్లిళ్లు, అంత్య‌క్రియ‌లు, క్రీడా ఈవెంట్ల‌కు ఈ నియ‌మం వ‌ర్తించ‌దు. గ‌త ఆదివారం నుంచి బ్రిట‌న్‌లో సుమారు 8400 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని బోరిస్ జాన్స్‌న్ కూడా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మీడియా స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.  స్కాట్‌ల్యాండ్‌, వేల్స్‌, నార్త‌ర్న్ ఐర్లాండ్‌లో మాత్రం వారి వారి స్వంత నిబంధ‌న‌లు అమ‌లులో ఉంటాయి. 

తాజావార్తలు


logo