మంగళవారం 19 జనవరి 2021
International - Dec 13, 2020 , 16:13:27

జూలో మంచు చిరుతకు కరోనా

జూలో మంచు చిరుతకు కరోనా

వాషింగ్టన్‌: అమెరికాలోని జూలో ఒక మంచు చిరుతకు కరోనా సోకింది. దీంతో అధికారులు మిగతా రెండు మంచు చిరుతలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. కెంటుకీలోని లూయిస్విల్లే జూలో మూడు మంచు చిరుతలు ఉన్నాయి. వీటిలో శ్వాసకోశ అనారోగ్య లక్షణాలను గుర్తించిన సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఒక మంచు చిరుతకు కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. తేలికపాటి కరోనా లక్షణాలున్న ఇవి కోలుకుంటాయని జూ అధికారులు తెలిపారు. జంతు సంరక్షకుడి నుంచి వీటికి కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచు చిరుతల ఎన్‌క్లోజర్స్‌ వద్దకు సందర్శకులు రాకుండా కట్టడి చేశారు. జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకినట్లు పరిశోధనల్లో వెల్లడి కానందున సందర్శకుల కోసం జూ తెరిచే ఉంటుందని తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.