గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 16, 2020 , 06:42:06

అధిక ఉష్ణంతో.. బుధగ్రహం ద్రువాల్లో మంచు!

అధిక ఉష్ణంతో.. బుధగ్రహం ద్రువాల్లో మంచు!

వాహింగ్టన్‌: బుధగ్రహం ద్రువ ప్రాంతాల్లోని మంచుకు అక్కడి తీవ్రమైన ఉష్ణ వాతావరణ పరిస్థితులే కారణమని అమెరికాలోని జార్జియా ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు తెలిపారు. బుధగ్రహంపై గ్రహ శకలాల ద్వారా నీరు ఏర్పడినప్పటికీ ద్రువ ప్రాంతాల్లోని మంచుగడ్డలకు అక్కడి పగటి సూర్యకాంతి వేడిమే కారణమని చెప్పారు. దీని వల్ల గ్రహం ఉపరితలంలోని హ్రైడాక్సిల్‌ గ్రూప్స్‌ (ఓహెచ్‌) వేరుపడి, అనంతర చర్యల వల్ల నీరు, హైడ్రోజన్‌ అణువులుగా ఏర్పాడతాయన్నారు.

ఉపరితలంలోకి ప్రవేశించిన అవి క్రమంగా ధ్రువ ప్రాంతాల్లోని చీకటి బిలాల్లోకి చేరి మంచుగా ఏర్పడుతున్నాయని తెలిపారు. దీంతో బుధగ్రహం ధ్రువ ప్రాంతాలు మంచు తయారీ ల్యాబ్‌లుగా పనిచేస్తున్నాయన్నది తమ పరిశోధనల్లో తేలిందన్నారు. మెసెంజర్‌ ఉపగ్రహం ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా తెలుసుకున్న ఈ వివరాలను ఆస్ట్రోఫిజికల్‌ జర్నల్‌ లెటర్స్‌లో సోమవారం ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు.  logo