ఆదివారం 29 నవంబర్ 2020
International - Nov 11, 2020 , 12:14:30

ట్రంప్‌కే రెండోసారి అధికార బ‌ద‌లాయింపు..

ట్రంప్‌కే రెండోసారి అధికార బ‌ద‌లాయింపు..

హైద‌రాబాద్‌:  తాజాగా ముగిసిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ నేత జో బైడెన్ గెలిచిన విష‌యం తెలిసిందే. కానీ అధ్య‌క్షుడు ట్రంప్ మాత్రం త‌న ఓట‌మిని అంగీక‌రించ‌డం లేదు.  ఇప్ప‌టికే కొన్ని ప్ర‌పంచ‌దేశాల నేత‌లు బైడెన్‌కు కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు. కానీ ట్రంప్ స‌ర్కార్‌లో ఉన్న విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాత్రం బైడెన్ విజ‌యాన్ని గుర్తించ‌లేదు.  అమెరికా ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత చాలా సున్నిత‌మైన రీతిలోనూ అధికార బ‌ద‌లాయింపు ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు.  అయితే ఆ బ‌ద‌లాయింపు.. రెండ‌వ‌సారి ట్రంప్ ప‌రిపాల‌న‌‌కే ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు.  బైడెన్ బృందంతో ట‌చ్‌లో ఉన్నారా అని అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.  ప్ర‌పంచ దేశాల‌కు త‌మ‌పై విశ్వాసం ఉండాల‌ని, దేశాధ్య‌క్షుడిగా ట్రంప్ జ‌న‌వ‌రి 20 వ‌ర‌కు ఉంటార‌ని ఆయ‌న అన్నారు.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నిక‌లు సుర‌క్షితంగా, స్వేచ్ఛ జ‌ర‌గాల‌ని త‌మ ప్ర‌భుత్వం భావిస్తుంద‌ని, ఆ ప్ర‌క్రియ‌ను నెర‌వేర్చేందుకు త‌మ ఆఫీసు సిద్ధంగా ఉంద‌ని ఆయ‌న అన్నారు.