శుక్రవారం 27 నవంబర్ 2020
International - Oct 31, 2020 , 11:02:07

ట‌ర్కీ భూకంపంతో మినీ సునామీ.. వీడియో

ట‌ర్కీ భూకంపంతో మినీ సునామీ.. వీడియో

హైద‌రాబాద్‌: ట‌ర్కీ ప‌శ్చిమ తీరం సెఫెరిమిసార్ జిల్లాలో భారీ భూకంపం వ‌ల్ల మినీ సునామీ వ‌చ్చింది.  కోస్ట‌ల్ ప‌ట్ట‌ణ‌మైన సిగాసిక్‌లో ఏజియ‌న్ స‌ముద్ర నీరు ఉప్పొంగింది.  6.6 తీవ్ర‌త‌తో భూకంపం వ‌చ్చిన వెంట‌నే.. సిగాసిక్ ప‌ట్ట‌ణంలోకి సునామీ నీరు ప్ర‌వేశించింది. మినీ సునామీ ధాటికి తీరం వెంట ఉన్న కొన్ని ఇండ్లు కొట్టుకుపోయాయి.  గ్రీసు, ట‌ర్కీ మ‌ధ్య ఉన్న ఏజియ‌ల్ స‌ముద్రంలో భూకంపం కేంద్రీకృత‌మై ఉన్న‌ది.  దీని వ‌ల్ల రెండు దేశాల్లోనూ భూ ప్ర‌కంప‌న‌లు న‌మోదు అయ్యాయి. ఇటు ట‌ర్కీ రాజ‌ధాని ఇస్తాంబుల్‌తో పాటు అటు గ్రీసు రాజ‌ధాని ఏథెన్స్‌లోనూ ప్ర‌కంప‌న‌లు న‌మోదు అయిన‌ట్లు తెలుస్తోంది.  గ్రీసుకు చెందిన సామోస్ దీవుల‌తో పాటు మ‌రికొన్ని దీవుల్లో భూకంపం వ‌ల్ల బిల్డింగ్‌లు ఊగిపోయాయి.  బ‌ల్గేరియాలో కూడా భూ ప్ర‌కంప‌న‌లు వ‌చ్చిన‌ట్లు ప్రాథ‌మికంగా తెలుస్తోంది. ఏజియ‌న్ సముద్ర తీరంలో ఉన్న దీవుల‌కు సునామీ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అనేక తీర ప్రాంతాల్లో స‌ముద్ర నీటి మ‌ట్టం పెరిగింది. 2005లో ఇజ్‌మిర్‌లో భారీ భూకంపం వ‌చ్చింది. అప్ప‌ట్లో వ‌రుస‌గా నాలుగు రోజులు 5.7 నుంచి 5.9 మ‌ధ్య రిక్ట‌ర్ తీవ్ర‌త‌తో భూ ప్ర‌కంప‌న‌లు న‌మోదు అయ్యాయి.