వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ కౌంటీలో ఘోర ప్రమాదం జరిగింది. చిన్న జెట్ విమానం టెన్నెస్సీ సరస్సులో కూలీపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు గల్లంతయ్యారు. రూథర్ఫర్డ్ కౌంటీలోని ఓ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన సెస్నా సీ501 అనే జెట్ విమానం స్మైర్నా సమీపంలోని పెర్సీ ప్రైస్ట్ సరస్సులో కూలిపోయింది. దీంతో అందులో ఉన్న ఏడుగురు గల్లంతయ్యారు. వారంతా చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వారికోసం గాలింపు కొనసాగుతున్నదని రూథర్ఫర్డ్ కౌంటీ ఫైర్ రెస్య్యూ క్యాప్టెన్ జొషువా సాండర్స్ చెప్పారు. గత శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ఒకరు చనిపోయారని పోలీసులు వెల్లడించారు.