శనివారం 06 జూన్ 2020
International - May 16, 2020 , 02:27:18

మా దేశంలో కరోనా ముగిసింది

మా దేశంలో కరోనా ముగిసింది

  • స్లొవేనియా ప్రకటన

జుల్బజానా: తమ దేశంలో కరోనా మహమ్మారి కథ ముగిసిందని ఐరోపా దేశం స్లొవేనియా ప్రకటించింది. కొత్త కేసులు నమోదవుతున్నప్పటికీ శుక్రవారం దేశ సరిహద్దులను తెరిచింది. కరోనాకు సంబంధించి యావత్‌ యూరోప్‌లో తమదేశంలోనే పరిస్థితి మెరుగ్గా ఉన్నదని, దీని వల్లే ఈ ప్రకటన చేసినట్లు స్లొవేనియా ప్రధానమంత్రి జానెజ్‌ జాన్సా తెలిపారు. ఇటలీ సరిహద్దున ఉన్న స్లొవేనియాలో ఇప్పటివరకు దాదాపు 1500 కేసులు నమోదు కాగా, 103 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులు నమోదు తగ్గిన నేపథ్యంలో మిగతా ఈయూ పౌరులకు సరిహద్దులను తెరిచింది. ఐరోపాయేతర పౌరులు మాత్రం 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. కరోనా ముప్పు ఇంకా పొంచి ఉన్నందున పలు ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు గుమిగూడడంపై నిషేధం కొనసాగనుంది. నిర్ణీత దూరం, మాస్క్‌ ధరించడం తప్పనిసరి. వచ్చే వారం నుంచి షాపింగ్‌ మాళ్లు, హోటళ్లు ప్రారంభం అవుతాయని, 23 నుంచి ఫుట్‌బాల్‌, ఇతర క్రీడాపోటీలు ప్రారంభించనుంది.


logo