బుధవారం 25 నవంబర్ 2020
International - Oct 19, 2020 , 16:27:47

భారత్ - శ్రీలంక సంయుక్తాధ్వర్యంలో నావికా దళ విన్యాసాలు ప్రారంభం

  భారత్ - శ్రీలంక సంయుక్తాధ్వర్యంలో నావికా దళ విన్యాసాలు ప్రారంభం

ఢిల్లీ : శ్రీ‌లంక‌లోని ట్రింకోమ‌లీలో ‌భార‌త నావికా ద‌ళం (ఐఎన్‌) - శ్రీ‌లంక నావికాద‌ళం (ఎస్ఎల్ఎన్‌)సంయుక్తాధ్వర్యంలో 8వ ఎడిషన్ నౌకద‌ళ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి 21వ‌ తేదీ వ‌ర‌కు స్లినెక్స్‌-20 పేరుతో విన్యాసాలు నిర్వహిస్తున్నారు. శ్రీ‌లంక దేశం త‌ర‌పున ఆ దేశ‌ నావికా దళానికి చెందిన ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ నావల్ ఫ్లీట్ రేర్ అడ్మిరల్ బండారా జయతిలకా నేతృత్వంలోని ఎస్‌ఎల్‌ఎన్ నౌక సయూరా (ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్ నౌక‌), గజబాహు (ట్రైనింగ్ షిప్) ఈ విన్యాసాల‌లో ప్రాతినిధ్యం వహించ‌నున్నాయి.

దేశీయంగా నిర్మించిన ఎఎస్‌డబ్ల్యు కొర్వెట్ట‌స్ కమోర్తా, కిల్తానందర్‌తో స‌హా ఈశాన్య ఫ్లీట్‌ కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్‌లు భారత  దళానికి ఈ విన్యాసాల‌లో ప్రాతినిధ్యం వహించ‌నున్నారు. దీనికి తోడు ఆయా నౌక‌ల్లో ఏర్పాటు చేసిన భార‌త‌ నేవీ 'అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్‌‌' (ఏఎల్‌హెచ్), చేత‌క్ హెలికాప్టర్ ఆన్‌బోర్డ్ ఇన్‌షిప్‌ల‌తో స‌హా ఈ విన్యాసాల‌లో భాగం కానున్నాయి. వీటితో పాటుగా మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ ‌క్రాఫ్ట్ డోర్నియర్ కూడా ఈ విన్యాసాల్లో పాల్గొననుంది. గ‌త ఏడాది (2019లో) స్లినెక్స్-19 నావికా ద‌ళ విన్యాసాలు విశాఖ‌ప‌ట్నం న‌గ‌రంలో నిర్వ‌హించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.