ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Sep 11, 2020 , 14:15:26

మ‌హ‌మ్మారికి ఆరు నెల‌లు..

మ‌హ‌మ్మారికి ఆరు నెల‌లు..

హైద‌రాబాద్‌: నోవ‌ల్ క‌రోనా వైర‌స్‌ను మ‌హ‌మ్మారిగా ప్ర‌క‌టించి నేటితో ఆరు నెల‌లు అవుతున్న‌ది.  మార్చి 11వ తేదీన ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ .. క‌రోనా వైర‌స్‌ను మ‌హమ్మారిగా ప్ర‌క‌టించింది. అత్య‌వ‌స‌రంగా, దూకుడు రీతిలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆ రోజున డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ అథ‌న‌మ్ గెబ్రియేసిస్ ప్ర‌పంచ దేశాల‌కు సూచించారు. డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌క‌ట‌న రాగానే.. యూరోప్‌లోని ఇట‌లీ దేశం తొలుత లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. ఆ స‌మ‌యంలో ఇట‌లీ, ఇరాన్ .. వైర‌స్ కేంద్ర‌బిందువులుగా ఉన్నాయి. అప్ప‌టికే చైనా, ద‌క్షిణ కొరియాలో వైర‌స్ గ‌రిష్ట స్థాయిని దాటేసంది. 

ఆర్నెళ్ల త‌ర్వాత ఇంకా చాలా దేశాల్లో అత్య‌ధిక స్థాయిలో కేసులు న‌మోదు అవుతూనే ఉన్నాయి.  మొద‌ట్లో కేసుల‌ను నియంత్రించిన దేశాల్లో మ‌ళ్లీ వైర‌స్ ఛాయ‌లు క‌నిపిస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 2.7 కోట్ల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మ‌ర‌ణాల సంఖ్య ప‌ది ల‌క్ష‌ల‌కు చేరువ‌వుతున్న‌ది. ఒక్క అమెరికాలోనే ల‌క్షా 91 వేల  మంది మ‌ర‌ణించారు. ఆ త‌ర్వాత స్థానాల్లో బ్రెజిల్‌, ఇండియా, మెక్సికో దేశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం భార‌త్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 45 ల‌క్ష‌లు దాటింది.logo