శనివారం 28 నవంబర్ 2020
International - Nov 18, 2020 , 15:27:05

సైనోవాక్.. చైనా టీకా మ‌ధ్యంత‌ర ట్ర‌య‌ల్స్ స‌క్సెస్‌

సైనోవాక్..  చైనా టీకా మ‌ధ్యంత‌ర ట్ర‌య‌ల్స్ స‌క్సెస్‌

హైద‌రాబాద్‌: చైనా అభివృద్ధి  చేస్తున్న‌ కోవిడ్‌19 వ్యాక్సిన్ విజ‌య‌వంత‌మైన‌ట్లు తెలుస్తోంది. మిడ్ స్టేజ్ ట్ర‌య‌ల్స్‌లో టీకా ప‌రీక్ష స‌క్సెస్ అయిన‌ట్లు ఆ దేశ ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. వాస్త‌వానికి చైనాలో ప‌లు ర‌కాల టీకాల‌ను డెవ‌ల‌ప్ చేస్తున్నారు.  ఇప్ప‌టికే కొన్ని టీకాల‌ను రోగుల‌పై ప‌రీక్షిస్తున్నారు. ప‌రిశోధ‌కుల ప్రకారం.. సైనోవాక్ బ‌యోటెక్ రూపొందిస్తున్న కోవిడ్ టీకా.. ట్ర‌య‌ల్స్ స‌మ‌యంలో అతిత్వ‌ర‌గా రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచిన‌ట్లు గుర్తించారు.  సుమారు 700 మందిపై నిర్వ‌హించిన ట్ర‌య‌ల్స్ ఆధారంగా ఈ విష‌యాన్ని తేల్చారు. యూరోప్‌, అమెరికా దేశాల్లో భారీ ఎత్తున నిర్వ‌హించిన వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ సక్సెస్ అయిన‌ట్లు డేటా ద్వారా తెలుస్తోంది.  

ఇప్ప‌టికే అమెరికా, జ‌ర్మ‌నీ, ర‌ష్యా దేశాలు అభివృద్ధి చేస్తున్న మూడు టీకాలు.. 90 శాతం పైగా స‌మ‌ర్థ‌తతో ప‌నిచేస్తున్న‌ట్లు రుజువైంది. అయితే ఇత‌ర దేశాల్లో కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చెందుతున్న త‌ర‌హాలోనే.. చైనాలో కూడా టీకా ట్ర‌య‌ల్స్ జోరుగా సాగుతున్నాయి. అక్క‌డ నాలుగు కంపెనీలు  మూడ‌వ‌, తుది క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్నాయి.  దాంట్లో సైనోవాక్ బ‌యోటెక్ టీకా కూడా ఉన్న‌ది. అయితే సైనోవాక్‌కు చెందిన క‌రోనావాక్ టీకా రోగుల్లో తొంద‌ర‌గా ఇమ్మ్యూన్ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ట‌ప‌రుస్తోంద‌ని గర్తించారు.  ఎంత శాతం వ‌ర‌కు టీకా స‌మ‌ర్ధంగా ఉంద‌న్న విష‌యం మాత్రం ఇంకా తెలియ‌లేదు.  

తొలి ద‌శ ట్ర‌య‌ల్స్‌లో 144 మందిపై ప‌రీక్ష చేప‌ట్టారు. రెండ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్‌లో 600 మందిపై టీకా ప‌రీక్ష నిర్వ‌మించారు.  అయితే ఎమ‌ర్జెన్సీలో టీకాను వాడ‌వ‌చ్చు అని నిర్ధార‌ణ అయిన‌ట్లు జూ ఫెంగ్‌చాయి త‌న నివేదిక‌లో పేర్కొన్నారు.  అయితే అతిపెద్ద సంఖ్య‌లో జ‌రుగుతున్న మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ గురించి రిపోర్ట్ ప్ర‌చురించాల్సి ఉన్న‌ది.