బుధవారం 03 జూన్ 2020
International - Apr 23, 2020 , 13:31:59

పాపాత్ములు.. మాన‌వ గ‌బ్బిలాలు

పాపాత్ములు.. మాన‌వ గ‌బ్బిలాలు

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ సోకింది గ‌బ్బిలాల నుంచే అని కొన్ని అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్న విష‌యం తెలిసిందే.  రాత్రిపూట సంచ‌రించే ఆ జీవాల‌ను కొంద‌రు భ‌యంగా చూస్తున్నారు.  అయితే గ‌బ్బిలాల‌పై క్రైస్త‌వ మ‌త గురువు పోప్ ఫ్రాన్సిస్ కూడా ఓ కామెంట్ చేశారు. ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో పాపాత్ముల‌ను మాన‌వ గ‌బ్బిలాలుగా పోల్చారు.  లాక్‌డౌన్ నేప‌థ్యంలో వాటిక‌న్ సిటీలో భ‌క్తుల‌కు దూరంగా ఉంటున్న పోప్ ఫ్రాన్సిస్‌.. త‌న ట్వీట్‌లో మాన‌వ మృగాల గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.  మ‌నుషులు గ‌బ్బిలాల త‌ర‌హాలో ఉండ‌రాద‌న్నారు.  పాపాల‌కు పాల్ప‌డేవారంతా రాత్రి పూట గ‌బ్బిలాల వ‌లే సంచ‌రిస్తార‌ని, వారు వెలుతురును గుర్తించ‌లేర‌న్నారు. పాప గుణం మ‌న‌లో ఉంటే, అప్పుడు మ‌నం మాన‌వ గ‌బ్బిలాల‌మే అన్నారు.  చీక‌ట్లో ఉండేందుకు ఎందుకు ఇష్ట‌ప‌డుతామంటే, వెతుతురు వ‌స్తే మ‌నం అలాంటి ప‌నులు చేసేందుకు ఇష్ట‌ప‌డం కాబ‌ట్టి అని అన్నారు. చీక‌టి ఆవ‌హించిన క‌న్నుల‌కు వెలుతురును గుర్తుప‌ట్ట‌డం కూడా రాద‌ని పోప్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. దేవుడి ప్రేమ‌గుణాన్ని మ‌న‌లో నింపుకోవాల‌న్నారు. చీక‌ట్లో న‌డ‌వాలా లేక వెలుతురులో న‌డ‌వాలా అని మ‌న‌మే నిర్ధారించుకోవాల‌న్నారు.
logo