బుధవారం 27 జనవరి 2021
International - Nov 28, 2020 , 16:14:48

భారీ ఎస్‌యూవీని మింగేసిన సింక్‌హోల్‌

భారీ ఎస్‌యూవీని మింగేసిన సింక్‌హోల్‌

న్యూయార్క్‌:  రోడ్డుపై ఏర్పడిన ఓ భారీ సింక్‌హోల్ పెద్ద ఎస్‌యూవీని మింగేసింది. ఈ ఘ‌ట‌న థ్యాంక్స్‌గివింగ్ డేనాడు న్యూయార్క్‌లో జ‌రిగింది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఆ వెహికిల్‌లో ఎవ‌రూ లేరు. ఇంత‌టి ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డినందుకు ఆ ఓన‌ర్ ఊపిరి పీల్చుకున్నాడు. నేను చాలా అదృష్ట‌వంతున్ని అని తుప్టెన్ టోప్జీ అనే ఆ వ్య‌క్తి చెప్పాడు. సింక్‌హోల్‌లోకి ఎస్‌యూవీ ప‌డిపోతున్న ఫొటోలు ట్విట‌ర్‌లో వైర‌ల్‌గా మారాయి. అయితే అంత భారీ సింక్‌హోల్ ఏర్ప‌డ‌టానికి కార‌ణం ఏంట‌న్న‌ది ఇంకా తెలియ‌లేదు. న్యూయార్క్ సిటీలో ఇలాంటి సింక్‌హోల్‌లు ఏర్ప‌డ‌టం ఇదే తొలిసారి కాదు. 2015లో బ్రూక్లిన్‌లో ఏర్ప‌డిన సింక్‌హోల్‌లోకి చాలా వ‌ర‌కు రోడ్డు కుంగిపోయింది. 


logo