లండన్: ఫైజర్, ఆస్ట్రాజెనికా సింగిల్ డోసు కోవిడ్ టీకాలతో .. సార్స్సీవోవీ2 వైరస్ నుంచి 65 ఏళ్లు దాటిన వారిలో 60 శాతం రక్షణ ఉన్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. ద లాన్సెట్ పత్రికలో అధ్యయన వివరాలను ప్రచురించారు. కేర్ హోమ్స్‌లో వ్యాక్సిన్ల పనితీరు ఎలా ఉందన్న కోణంలో అధ్యయనం సాగింది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు ఇంగ్లండ్‌లో ఉన్న కేర్ హోమ్స్‌లో సార్స్ సీవోవీ2 వైరస్ ఎలా వ్యాప్తి అయ్యిందో స్టడీ చేశారు. 65 ఏళ్లు దాటిన వారిపై ఆ వైరస్ ప్రభావాన్ని అధ్యయనం చేశారు. అయితే బ్రిటన్‌లో డెల్టా వేరియంట్ విజృంభించక ముందే ఈ స్టడీ జరిగింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వారం వారం తేడాలో జరుగుతున్న మార్పులను స్టడీ చేశారు. కేర్ హోమ్స్‌లో ఉన్న 10 వేల మందిని వాళ్లు పరిశీలించారు. దాంట్లో 70 శాతం మంది మహిళలు ఉన్నారు. కనీసం 9 వేల మంది ఒక డోసు టీకా తీసుకున్నవారున్నారు. అందులో 6 వేల మంది ఆస్ట్రాజెనికా, మూడు వేల మంది ఫైటర్ టీకాలు వేయించుకున్నారు.