గురువారం 28 మే 2020
International - May 06, 2020 , 14:49:32

సింగ‌పూర్‌లో ఈ రోజు కొత్త‌గా 788 కోవిడ్‌-19 పాజిటివ్ కేసులు

సింగ‌పూర్‌లో ఈ రోజు కొత్త‌గా 788 కోవిడ్‌-19 పాజిటివ్ కేసులు

సింగ‌పూర్‌:  సింగ‌పూర్‌లో ఈ రోజు కొత్త‌గా 788 కోవిడ్ 19 కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో మొత్తం వైర‌స్ బారిన ప‌డిన బాధితులు 20,198 మందికి చేరుకున్నారు. క‌రోనాపాజిటివ్ బాధితుల్లో ఎక్కువ మంది ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చిన కార్మికులు ఉన్నార‌ని అధికారులు తెలిపారు. వారిలో భార‌తీయులు ఎక్కువ మంది ఉన్నార‌ని పేర్కొన్నారు. విదేశీ కార్మికులు ఉండే వ‌స‌తి గృహాల్లో ఎక్కువ‌గా వైర‌స్ వ్యాపిస్తుంద‌ని గుర్తించామ‌న్నారు. అటువంటి వ‌స‌తి గృహాల్లో సానిటైజేష‌న్ ప‌నులు చేప‌ట్టామ‌న్నారు. కార్మికులు ఉంటున్న గ‌దుల్లో క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. రూంలో ఉన్న‌ప్పుడు, బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు, ప‌ని ప్ర‌దేశంలో మాస్క్‌ల వినియోగం త‌ప్ప‌నిస‌రి చేశామ‌న్నారు. అత్య‌వ‌స‌ర ప‌ని ప్ర‌దేశాల్లో కార్మికుల‌కు ప‌రీక్ష‌లు త‌ప్ప‌ని స‌రి చేశామ‌ని పేర్కొన్నారు. 


logo