గురువారం 28 మే 2020
International - Apr 25, 2020 , 13:29:50

సింగపూర్‌లో 12వేలు దాటిన కరోనా కేసులు

సింగపూర్‌లో 12వేలు దాటిన కరోనా కేసులు

సింగపూర్‌: సింగపూర్‌లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. శనివారం  కొత్తగా 618 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య  12,693కు చేరిందని ఆదేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. కరోనా బాధితుల్లో  వలస కార్మికులే ఎక్కువగా ఉన్నారు.  డార్మిటరీల్లో నివసిస్తున్న వలస కార్మికులకు వైరస్‌ సోకడంతో కేసుల సంఖ్య పెరుగుతోందని సింగపూర్‌ ఆరోగ్యశాఖ తెలిపింది. కేవలం ఏడుగురు మాత్రమే సింగపూర్‌ దేశీయులని చెప్పింది. ఆగ్నేయాసియాలో అత్యధిక కేసులున్న దేశం సింగపూరే కావడం గమనార్హం.   ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ దేశాల కన్నా  'కొవిడ్‌-19' ప్ర‌భావం సింగపూర్‌లోనే ఎక్కువగా ఉంది. 


logo