శనివారం 30 మే 2020
International - Apr 28, 2020 , 14:48:58

సింగపూర్‌లో 15వేలకు చేరువలో కరోనా కేసులు

సింగపూర్‌లో 15వేలకు చేరువలో కరోనా కేసులు

సింగపూర్‌లో మంగళవారం కొత్తగా 528 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల్లో కేవలం 8 మంది మాత్రమే సింగపూర్‌ దేశీయులు కావడం గమనార్హం.  దీంతో ఆదేశంలో కోవిడ్‌-19 బాధితుల సంఖ్య 14,951కు చేరింది. డార్మిటరీల్లో నివసిస్తున్న 323,000 మంది వలస కార్మికుల్లో 12,183 మంది వైరస్‌ బారినపడ్డారు. ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ఈ ప్రాంతాలను హాట్‌స్పాట్‌గా  గుర్తించారు. సింగపూర్‌లో ఇప్పటి వరకు 2300 మందికి పైగా భారతీయులకు వైరస్‌ సోకింది. వారిలో ఎక్కువ మంది డార్మిటరీల్లో నివసిస్తున్నవారే. logo