గురువారం 04 జూన్ 2020
International - Apr 21, 2020 , 15:28:44

సింగపూర్‌లో 9వేలు దాటిన కరోనా కేసులు

సింగపూర్‌లో 9వేలు దాటిన కరోనా కేసులు

సింగపూర్‌: సింగపూర్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మంగళవారం కొత్తగా 1,111 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య  9,125కు చేరిందని ఆదేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. కరోనా బాధితుల్లో  వలస కార్మికులే ఎక్కువగా ఉన్నారు. సోమవారం ఒక్కరోజే రికార్ఢు స్థాయిలో 1,426 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.  ఆగ్నేయాసియాలో అత్యధిక కేసులున్న దేశం సింగపూరేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ రీజియనల్‌ చీఫ్‌ తెలిపారు.   ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ దేశాల కన్నా  'కొవిడ్‌-19' ప్ర‌భావం సింగపూర్‌లోనే ఎక్కువగా ఉంది. logo