శనివారం 06 జూన్ 2020
International - Apr 20, 2020 , 18:35:24

ఆగ్నేయాసియాలో అత్యధిక కేసులున్న దేశం సింగపూరే

ఆగ్నేయాసియాలో అత్యధిక కేసులున్న దేశం సింగపూరే

సింగపూర్‌: సింగపూర్‌లో సోమవారం కొత్తగా 1,426 మందికి కరోనా సోకింది.  కొత్తగా వైరస్‌ సోకిన వారిలో చాలా మంది విదేశీయులే ఉండగా కేవలం 16 మంది మాత్రమే  సింగపూర్‌ వాసులు ఉన్నారు.  వర్క్‌ పర్మిట్‌ కలిగి విదేశీ కార్మికుల వసతి గృహాలలో నివసిస్తున్న వారే ఎక్కువగా వైరస్‌ బారినపడుతున్నారు.  ఇప్పటి వరకు ఆదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,014కు పెరిగింది. ఆగ్నేయాసియాలో అత్యధిక కేసులున్న దేశం సింగపూరే కావడం గమనార్హం.  ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ దేశాల కన్నా  'కొవిడ్‌-19' ప్ర‌భావం సింగపూర్‌లోనే ఎక్కువగా ఉంది. 


logo