గురువారం 28 మే 2020
International - Apr 08, 2020 , 11:07:28

సామూహిక వేడుక‌ల‌ను నిషేధించిన సింగ‌పూర్‌

సామూహిక వేడుక‌ల‌ను నిషేధించిన సింగ‌పూర్‌

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో.. సింగ‌పూర్ ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న‌ది.  సామూహిక వేడుక‌ల‌ను ఆ దేశం నిషేధించింది.  ఇంట్లో అయినా, లేక రెస్టారెంట్ల‌లో అయినా ఎటువంటి వేడుక‌లు నిర్వ‌హించ‌రాదు అని ఆ దేశం ప్ర‌జ‌ల‌కు వార్నింగ్ ఇచ్చింది. ఈ ఆదేశాల ప్ర‌కారం ఫ్యామిలీ స‌భ్యుల‌తో ప్రైవేటు వేడుక‌లు కానీ, స్నేహితుల‌తో స‌ర‌దా వేడుక‌లు కానీ నిర్వహించ‌రాదు.  ఇంటి వ‌ద్ద కూడా వ్య‌క్తుల స‌మూహాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో అనుమ‌తి ఇచ్చేది లేద‌ని ప్ర‌భుత్వం తీర్మానించింది.  ఇప్ప‌టికే కార్యాల‌యాలు, స్కూళ్లు, వ్యాపార కేంద్రాల‌ను సింగ‌పూర్ మూసివేసింది.  అయితే ప్ర‌స్తుతం ఆంక్ష‌ల‌న్నీ మే 4వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ఆ దేశం చెప్పింది.  సింగ‌పూర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 1481 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.logo