బుధవారం 15 జూలై 2020
International - Jun 03, 2020 , 16:08:04

అది ముమ్మాటికీ జాత్యాహంకార పాపమే: పోప్‌

అది ముమ్మాటికీ జాత్యాహంకార పాపమే: పోప్‌

వాటికన్‌ సిటీ: అమెరికాలోని మిన్నిపొలిస్‌ ప్రాంతంలో పోలీసుల చేతిలో చనిపోయిన జార్జ్‌ ఫ్లాయిడ్‌ది ముమ్మాటికీ జాత్యాహంకార పాపమే అని పేర్కొన్నారు పోప్‌ ఫ్రాన్సిస్‌. అల్లర్లు శృతిమించి ఇబ్బందులకు గురవకముందే జాతీయ సయోధ్యకు పూనుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జాత్యాహంకారం భరించలేనిది, అయినప్పటికీ విధి హింస విచ్చినమైందని, స్వీయ విధ్వంసం-స్వీయ ఓటమి అని అన్నారు. 

పోలీసుల అదుపులో ఉన్న నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్రాయడ్‌ మరణంపై గత ఎనిమిదిరోజులుగా అమెరికా అంతటా నిరసనలు మిన్నంటుతున్న విషయం తెలిసిందే. ఆందోళనలు వైట్‌హైజ్‌కు చేరుకోవడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బంకర్‌లోకి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యలో పోప్‌ ఫ్రాన్సిస్‌ తన విచారాన్ని వ్యక్తంచేస్తూ.. జార్జ్‌ ఫాయిడ్‌ మరణం విషాదకరమైనదని, జాత్యాహంకారం యొక్క పాపం ఫలితంగానే ఆయన చనిపోయారని విచారం వ్యక్తం చేశారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌తోపాటు జాత్యాహంకారం కారణంగా మరణించిన వారి కోసం ప్రార్థిస్తున్నానని పోప్‌ ఫ్రాన్సిస్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో ఎదురవుతున్న సామాజిక అశాంతి కారణంగా తాను చాలా బాధపడుతున్నానని చెప్పారు. జాత్యాహంకారం ఏరూపంలో వచ్చిన భరింలేమని, మనమంతా మానవ జీవితంలోని పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఇదే సమయంలో గత ఎనిమిది రోజులుగా జరుగుతున్న నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతున్న తీరును కూడా గమనించాలని ఆయన అమెరాకా ప్రజలకు పిలుపునిచ్చారు. 

తాజావార్తలు


logo