శనివారం 06 జూన్ 2020
International - May 02, 2020 , 16:53:11

యూకే వీధుల్లో అదిరిపోయే బాంగ్రా డ్యాన్స్..వీడియో

యూకే వీధుల్లో అదిరిపోయే బాంగ్రా డ్యాన్స్..వీడియో

క‌రోనా వైర‌స్ ధాటికి ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రూ క్వారంటైన్ కు ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ తో ఇంటి ద‌గ్గరే ఉండి బోరు కొట్ట‌కుండా త‌మికిష్ట‌మైన ప‌నులు చేస్తూ చాలా మంది టైంపాస్ చేస్తున్నారు. యూకేలోని ఓ వీధిలో ఇండియ‌న్ సాంగ్ మార్మోగిపోయింది.

యూకే వీధిలో సిక్కు వ్య‌క్తితో పాటు మ‌రికొంత‌మంది పంజాబీ న‌టుడు దిల్జీజ్ దోసాంజ్ న‌టించిన స‌ర్దార్‌జీ చిత్రంలోని వీర్‌వార్ పాట‌కు డోలు వాయిస్తూ, బాంగ్రా నృత్యం చేస్తూ అద‌రగొట్టాడు. ఈ వీడియో ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. అమ్మ వీధిలో డ్యాన్స్ చేయ‌డానికి తీసుకొచ్చింది అనే క్యాప్ష‌న్ తో షేర్గిల్ జీ ఈ వీడియోను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo