బుధవారం 27 జనవరి 2021
International - Dec 05, 2020 , 07:13:36

అమెరికాలో పోస్టాఫీస్‌కు ఇండియన్‌ అమెరికన్‌ పేరు

అమెరికాలో పోస్టాఫీస్‌కు ఇండియన్‌ అమెరికన్‌ పేరు

వాషింగ్టన్‌: అమెరికాలో ఓ పోస్టాఫీస్‌కు భారతీయ అమెరికన్‌ పోలీసు అధికారి పేరు పెట్టనున్నారు. ఈ మేరకు రూపొందించిన బిల్లుకు అమెరికన్‌ సెనెట్‌ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అది అధ్యక్షుడు ట్రంప్‌ ఆమోదం కోసం వైట్‌హౌస్‌కు చేరింది. గతేడాది హూస్టన్‌లో ట్రాఫిక్‌ విధులు నిర్వర్తిస్తున్న సిక్‌ పోలీస్‌ ఆఫీసర్‌ సందీప్‌ సింగ్‌ ధలీవాల్‌పై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో సందీప్‌సింగ్‌ అక్కడిక్కడే మరణించారు. 

అతని గుర్తుగా హూస్టన్‌లోని 315 315 హాడిక్స్‌ హావెల్‌ రోడ్డులో ఉన్న పోస్టాఫీస్‌కు ‘డిప్యూటీ సందీప్‌ సింగ్‌ ధలీవాల్ పోస్టాఫీస్ బిల్డింగ్‌’ అని పేరుపెట్టాలని అమెరికా ప్రతినిధుల సభ గత సెప్టెంబర్‌లో చట్టాన్ని రూపొందించింది. తాజాగా దానిని సెనెట్‌ ఆమెదించింది. దీంతో అమెరికాలో భారత సంతతి వ్యక్తి పేరుతో ఉన్న రెండో పోస్టాఫీస్‌గా గుర్తింపు పొందింది. 

2006లో దక్షిణ కాలిఫోర్నియాలో కాంగ్రెస్‌ సభ్యుడు భారత అమెరికెన్‌ దలీప్‌ సింగ్‌ సౌండ్‌ పేరు పెట్టారు. కాగా, టెక్సాస్‌లోని కాస్ట్రోవిల్లేలో ఉన్న మరో యూఎస్‌ ఆఫీసును ‘లాన్స్‌ కార్పోరల్‌ రొనాల్డ్‌ డైన్‌ రైర్డాన్‌ పోస్టాఫీస్‌’గా మార్చారు.


logo