e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home News సైన్ లాంగ్వేజ్ తెలుసంటూ ఉద్యోగంలో చేరి పోలీసుల ప‌రువుతీసిన మ‌హిళ‌..!

సైన్ లాంగ్వేజ్ తెలుసంటూ ఉద్యోగంలో చేరి పోలీసుల ప‌రువుతీసిన మ‌హిళ‌..!

హైద‌రాబాద్‌: సైన్ లాంగ్వేజ్ ఇంట‌ర్‌ప్రెట‌ర్స్‌ అంటే సంకేత భాషా నిపుణులు, అంటే మూగ‌వాళ్ల కోసం వినియోగంలో ఉన్న భాష (బ‌దిరుల భాష‌) తెలిసిన వారు, అంటే చేతి సైగ‌లతో సంభాషించగ‌ల వారు అని అర్థం. మూగ‌వారికి అర్థ‌మ‌య్యేలా స‌మాచారం ఇవ్వ‌డం కోసం ప‌లు విభాగాల్లో ఈ సైన్ లాంగ్వేజ్ ఇంట‌ర్‌ప్రెట‌ర్స్‌ను నియ‌మించుకుంటారు. అదేవిధంగా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోగ‌ల తంపా ఏరియా పోలీసులు కూడా త‌మ ద‌గ్గ‌రున్న క్రైమ్ స‌మాచారాన్ని బ‌దిరుల‌కు తెలియ‌జేయ‌డం కోసం డెర్లిన్ రాబ‌ర్ట్ అనే మ‌హిళ‌ను సైన్ లాంగ్వేజ్ ఇంట‌ర్‌ప్రెట‌ర్‌గా నియ‌మించుకున్నారు.

ఈ క్ర‌మంలో ఎంతో క‌ష్ట‌ప‌డి ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్‌ను దొర‌క‌బ‌ట్టిన పోలీసులు.. ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఓ వైపు పోలీస్ అధికారులు మాట్లాతుండ‌గా, మ‌రోవైపు డెర్లిన్ రాబ‌ర్ట్ సైన్ లాంగ్వేజ్ ఇంట‌ర్‌ప్రెట‌ర్‌గా న‌టించడం మొద‌లుపెట్టింది. అధికారుల సంభాష‌ణ‌తో సంబంధంలేకుండా ఆమె సైగ‌లు చేస్తుండ‌టంతో.. నిపుణులు ఆమెకు సైన్ లాంగ్వేజ్‌ రాద‌ని క‌నిపెట్టారు. వెంట‌నే పోలీసుల‌కు విష‌యం తెలియ‌జేయ‌డంతో వారు విచార‌ణ జ‌రిపారు.

- Advertisement -

ఆమెకు సైన్ లాంగ్వేజ్ రాద‌ని తెలిసి ముక్కున వేలేసుకున్నారు. పైగా ఆమెకు నేర‌చ‌రిత్ర కూడా ఉన్న‌ద‌ని గుర్తించారు. ఒక నేర‌స్తురాల‌ని ఆమె బ్యాక్ గ్రౌండ్‌ తెలియ‌కుండా ఉద్యోగంలో పెట్టుకోవ‌డ‌మేగాక‌, కీల‌క‌మైన ప్రెస్‌మీట్‌లో నిల‌బెట్టి ఆమెతో పిచ్చి సైగ‌లు చేయించినందుకు పోలీసుల ప‌రువు పోయింది. దాంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే, 2017లో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో ఇప్పుడు మ‌రోసారి సోష‌ల్‌మీడియాలో మ‌రోసారి ట్రెండ్ అవుతున్న‌ది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement