గురువారం 21 జనవరి 2021
International - Nov 29, 2020 , 01:35:56

గర్భనిరోధక సాధనాల కొరత

గర్భనిరోధక సాధనాల కొరత

  • పెరుగనున్న జననాలు, ఎయిడ్స్‌ కేసులు
  • కరోనా సంక్షోభంలో కొత్త కోణం

జెనీవా, నవంబర్‌ 28: కరోనా సంక్షోభం తాలూకు విపరిణామాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మహమ్మారి కారణంగా భారత్‌లో దాదాపు 2.5 కోట్ల జంటలకు గర్భనిరోధక సాధనాలు అందుబాటులో లేకుండా పోయాయని యూఎన్‌ఏఐడీఎస్‌ (హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ఐక్యరాజ్యసమితి ప్రోగ్రామ్‌) నివేదిక వెల్లడించింది. దీంతో రానున్న రోజుల్లో జననాలు మరింత పెరుగుతాయని పేర్కొంది. ఇప్పటికే పట్టాలు తప్పిన ఎయిడ్స్‌ నియంత్రణ చర్యలకు కరోనా సంక్షోభం మరిన్ని అడ్డంకులు ఏర్పరచిందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో 2020-22 మధ్య అదనంగా 1,23,00-2,93,000 హెచ్‌ఐవీ కేసులు నమోదుకావొచ్చని, అదనంగా 69,000-1,48,000 మంది ఎయిడ్స్‌తో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని అంచనావేసింది. హెచ్‌ఐవీ నియంత్రణలో సమిష్టి వైఫల్యానికి మూల్యం చెల్లించాల్సి వస్తున్నదని యూఎన్‌ఏఐడీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విన్నీ బ్యాన్‌యిమా పేర్కొన్నారు.


logo