సోమవారం 01 జూన్ 2020
International - Apr 07, 2020 , 13:50:02

ఈక్వెడార్ లో శవపేటికలకు కొరత

ఈక్వెడార్ లో శవపేటికలకు కొరత

గుయాకిల్ సిటీ: చైనాలోని వుహాన్‌లో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అత‌లాకుత‌లం చేస్తుంది. అనేక దేశాల్లో రోజూ వందలాది మందిని బలి తీసుకుంటున్నది. ఈక్వెడార్‌లోనూ ఈ మ‌హ‌మ్మారి వేగంగా విస్త‌రిస్తున్న‌ది. ఇప్ప‌టికే అక్క‌డ 3,764మందికి క‌రోనా పాజిటివ్ రాగా...191 మంది మృతిచెందారు. కాగా ఆ దేశంలోని గుయాకిల్ సిటీలో శవపేటికలకు కొరత ఏర్పడింది. శవాలను ఉంచేందుకు బాక్సులను వాడుతున్నా రు. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య‌ 14ల‌క్ష‌ల‌కు చేరువైంది. 75వేలు మ‌ర‌ణాలు సంభ‌వించాయి.


logo