శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Mar 26, 2020 , 16:19:34

హెచ్చరికలతో టోక్యోలో కొనుగోళ్ల హడావిడి

హెచ్చరికలతో టోక్యోలో కొనుగోళ్ల హడావిడి

 టోక్యోలో : కరోనా తీవ్రత ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలిసివస్తున్నది. ఇంటిపట్టున ఎన్నాళ్లుండాలో లెక్కతేలడం లేదు. ఈ నేపథ్యంలో టోక్యో గవర్నర్ కోయికే చేసిన ఓ హెచ్చరికతో ప్రజలు ఎగబడి కొనుగోళ్లు చేశారు. కరోనా విస్తరణ విస్ఫోటనం చూడబోతున్నదని అధికారులు హెచ్చరించారు. కరోనా ఉత్పాతం కీలక దశకు చేరుకున్నదని, ఈ వారం కరోనా వ్యాప్తి అత్యధికంగా ఉంటుందని తెలిపారు. వారాంతంలో అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్లవద్దని, ఇంటిపట్టనే ఉండిపొమ్మని తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. దీంతో ప్రజలు దుకాణాలు, మాల్స్ మీద పడ్డారు. దొరికినవి దొరికనట్టు కొనేసి ఇంటికి పట్టుకుపోయారు. దీంతో దుకాణాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. సరుకులకు కొరత ఏర్పడింది. అయితే ఇలా కొనుగోళ్లు జరపవద్దని, అందరికీ తగిన సరఫరాలు అందుబాటులో ఉన్నాయని మరోసారి అధికారులు ప్రజలకు విజ్ఞప్తులు చేయాల్సి వచ్చింది.


logo