బుధవారం 27 మే 2020
International - May 19, 2020 , 16:28:40

పుచ్చకాయతో మాస్క్‌.. ఫొటోకు ఫోజ్‌!

పుచ్చకాయతో మాస్క్‌.. ఫొటోకు ఫోజ్‌!

మార్కెట్‌లోకి కొత్తరకం మాస్కులు వచ్చాయి అనుకునేరు. వీరిద్దరినీ ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ఈ మాస్క్‌ను ఎంచుకున్నారు. పైగా కళ్ల దగ్గర చిన్న రంధ్రాలను కూడా అందంగా చెక్కారు. హెల్మట్‌లా ఉండే ఈ మాస్క్‌ని ధరించి ఇద్దరు యువకులు యుఎస్‌, వర్జీనియా నగరంలోని షీట్జ్‌ స్టోర్‌లోకి చొరబడ్డారు. టొయోటా ట్రక్‌లో వచ్చిన వీరు స్టోర్‌లో అల్లరల్లరి చేశారు. యజమానులను బురిడీ కొట్టించి చోరీకి పాల్పడ్డారు. చివరికీ సీసీ ఫుటేజ్‌ ద్వారా దొంగతనం బయటపడింది. వీరి ముఖాలు చూసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చేసేదేం లేక ఫోలీసులకు ఫిర్యాదు చేశారు యజమానులు. వీరు రంగంలోకి దిగాక యువకుల పప్పులేం ఉడకలేదు. స్టోర్‌లో ఫొటోకు ఫోజులిచ్చిన చిత్రాల ఆధారంగా వెతికి అరెస్ట్‌ చేశారు. ఈ ఫొటోలను లూయిసా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. మార్కెట్‌లో ఇన్ని మాస్కులు ఉండగా మనుషులు గుర్తుపట్టని విధంగా మాస్క్‌ వేసుకోవడం నేరమంటూ పోలీసులు హెచ్చరించారు. ఇప్పుడీ ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. logo