శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 21, 2020 , 01:42:44

కెనడాలో నరమేధం

కెనడాలో నరమేధం

  • దుండగుడి కాల్పుల్లో 16 మంది మృతి 

టొరంటో, ఏప్రిల్‌ 20: కెనడాలోని నోవాస్కోటియా రాష్ట్రంలో ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 16 మందిని బలితీసుకున్నాడు. కెనడా చరిత్రలోనే అతిపెద్ద దాడిగా నిలిచిన ఈ ఘటన ఆదివారం జరిగింది. నోవాస్కాటియాలోని మారుమూల పట్టణమైన పోర్ట్‌పిక్‌లో గాబ్రియెల్‌ వోర్ట్‌మన్‌ (51) అనే దుండగుడు పోలీస్‌ యూని ఫాం ధరించి, పోలీస్‌ వాహనంలాగా మార్చిన కారులో వచ్చి పలు ఇండ్లలోకి చొచ్చుకొచ్చి ఈ మారణహోమానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో మొత్తం 16 మంది మృతిచెందారు. రంగంలోకి దిగిన పోలీసులు.. అతడి కోసం రాత్రంతా గాలించారు. కొంత సమయం అనం తరం అతడు చనిపోయాడని మరో ప్రకటన చేశారు. హతుడు ఎలా చనిపోయాడో తెలియాల్సి ఉన్నది.


logo