మంగళవారం 19 జనవరి 2021
International - Dec 27, 2020 , 13:07:33

అమెరికాలో మ‌ళ్లీ కాల్పుల క‌ల‌క‌లం.. ముగ్గురి మృతి

అమెరికాలో మ‌ళ్లీ కాల్పుల క‌ల‌క‌లం.. ముగ్గురి మృతి

షికాగో‌: అమెరికాలో మ‌ళ్లీ కాల్పులు క‌ల‌కలం రేపాయి. ఇలినాయిస్‌లోని రాక్‌ఫోర్డ్‌లో ఉన్న ఓ బౌలింగ్ అలేలో ఓ వ్య‌క్తి కాల్పులు జ‌రిపాడు. దీంతో ముగ్గురు మృతి చెంద‌గా.. మ‌రో ముగ్గురు గాయ‌ప‌డ్డారు. శ‌నివారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఈ షూటింగ్ త‌ర్వాత ఓ వ్య‌క్తిని తాము క‌స్ట‌డీలోకి తీసుకున్న‌ట్లు రాక్‌ఫోర్డ్ పోలీస్ చీఫ్ డాన్ ఓషియా చెప్పారు. అయితే కాల్పులు జ‌రిగిన వ్య‌క్తి గురించి కానీ, బాధితుల గురించి కానీ ఇత‌ర స‌మాచారం ఏదీ ఇవ్వ‌లేదు. పోలీస్ ఆఫీస‌ర్లు ఎవ‌రూ ఈ సంద‌ర్భంగా కాల్పులు జ‌ర‌ప‌లేద‌ని ఆయన తెలిపారు.