e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News షాకింగ్: న‌గ్నంగా చ‌ర్చిపైకి ఎక్కి.. శిలువ‌కు నిప్పుపెట్టి.. వీడియో

షాకింగ్: న‌గ్నంగా చ‌ర్చిపైకి ఎక్కి.. శిలువ‌కు నిప్పుపెట్టి.. వీడియో

షాకింగ్: న‌గ్నంగా చ‌ర్చిపైకి ఎక్కి.. శిలువ‌కు నిప్పుపెట్టి.. వీడియో

లాస్ ఏంజెలిస్: అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో ఓ షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ వ్య‌క్తి దాదాపు న‌గ్నంగా (ఒంటిపై క‌ట్ డ్రాయ‌ర్ మాత్ర‌మే ఉంది) చ‌ర్చిపైకి ఎక్కి.. ఆ చ‌ర్చి శిఖ‌రం మీద ఉన్న శిలువ‌కు నిప్పుపెట్టాడు. అనంత‌రం ఒక బిల్డింగ్ మీద నుంచి మ‌రో బిల్డింగ్ మీద‌కు దూకుతూ త‌ప్పించుకున్నాడు. అయితే ఈ త‌తంగం అంతా లాస్ ఏంజెలిస్‌కే చెందిన‌ ఫాక్స్‌-11 అనే మీడియా సంస్థ కెమెరాకు చిక్కింది. ఫాక్స్‌-11 సిబ్బంది హెలిక్యాప్ట‌ర్ పై నుంచి న‌గ‌రానికి సంబంధించిన వీడియోలు తీసుకుంటుండ‌గా.. అందులో ఆ న‌గ్న వ్య‌క్తి బాగోతం కూడా రికార్డ‌య్యింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. లాస్ ఏంజెలిస్‌లోని బోయిల్ హైట్ ఏరియాలో సెయింట్ మేరీ క్యాథ‌లిక్ చర్చి ఉన్న‌ది. నాలుగంత‌స్తులు ఉన్న ఈ చ‌ర్చి శిఖ‌రంపైకి ఓ వ్య‌క్తి కేవ‌లం ఒంటిపై డ్రాయ‌ర్‌తో (దాదాపు న‌గ్నంగా) ఎక్కాడు. అనంత‌రం దానిపై ఉన్న ఏసుక్రీస్తు శిలువ‌కు నిప్ప‌టించాడు. ఆ త‌ర్వాత ఒక భ‌వ‌నం మీద నుంచి మ‌రో భ‌వ‌నం మీద‌కు దూకుతూ పారిపోయాడు. అయితే, మంట‌లు చ‌ర్చిలోప‌లికి వ్యాపించ‌క‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది.

- Advertisement -

వెంట‌నే పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను ఆర్పివేశారు. అంత‌కుముందే నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ స‌మ‌యంలో నిందితుడి ఒంటిపై లీ డ్రాయ‌ర్ త‌ప్ప ఏమీ లేద‌ని పోలీసులు చెప్పారు. ఘ‌ట‌న‌కు సంబంధించి అత‌డిని ఇంటరాగేట్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. కాగా, ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నిందితుడు ఒక బిల్డింగ్ మీద నుంచి మ‌రో బిల్డింగ్ మీద‌కు దూకుతున్న దృశ్యాల‌ను చూసి నెటిజ‌న్‌లు ఎంజాయ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

ఆ టాయిలెట్స్ వినియోగిస్తే మ‌న‌కే డ‌బ్బులిస్తార‌ట‌..!

లేహ్ ఆందాల వీక్ష‌ణ‌కు పోటెత్తిన టూరిస్టులు..!

ఇంట్లో దూరి 21 పిల్ల‌లు చేసిన నాగుపాము..!

ముక్కులో చెక్క‌పుల్ల‌లు.. వార‌మైనా గుర్తించ‌లేక‌పోయిన మ‌హిళ‌..!

అద్భుత‌మైన‌ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టిన వృద్ధుడు.. వైర‌ల్ వీడియో

ఆకాశంలో మ‌రో ఖ‌గోళ అద్భుతం..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
షాకింగ్: న‌గ్నంగా చ‌ర్చిపైకి ఎక్కి.. శిలువ‌కు నిప్పుపెట్టి.. వీడియో
షాకింగ్: న‌గ్నంగా చ‌ర్చిపైకి ఎక్కి.. శిలువ‌కు నిప్పుపెట్టి.. వీడియో
షాకింగ్: న‌గ్నంగా చ‌ర్చిపైకి ఎక్కి.. శిలువ‌కు నిప్పుపెట్టి.. వీడియో

ట్రెండింగ్‌

Advertisement