ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Aug 14, 2020 , 12:49:17

ఇప్పుడే 225 కిలోలున్నాడు.. ఇంకా బ‌రువు పెరిగేందుకు రోజుకు ప‌దివేల కేల‌రీల ఆహారమ‌ట‌!

ఇప్పుడే 225 కిలోలున్నాడు.. ఇంకా బ‌రువు పెరిగేందుకు రోజుకు ప‌దివేల కేల‌రీల ఆహారమ‌ట‌!

శ‌రీరంలో కొంచెం ఫాట్ ఏర్ప‌డిందంటే చాలు ఒక‌పూట తినే ఆహారం మూడుపూట‌ల తింటారు. అలాంటిది ఇత‌ను 225 కిలోల బ‌రువు ఉన్న‌ప్ప‌టికీ ఇంకా బ‌రువు పెరిగేందుకు రోజుకు 10,000 కేల‌రీల ఉన్న ఆహారం తింటున్నాడు. ఒక మ‌నిషి రోజుకు తీసుకునే ఆహారానికి నాలుగు రెట్లు ఎక్కువ ఆహారం. ఇత‌ను ప‌నీబాటా లేకుండా ఇలా చేయ‌డం లేదు. బ‌రువు పెరిగే వృత్తిలో ఇలా చేస్తున్నాడు 44 ఏండ్ల గైన‌ర్ బుల్ దీని అస‌లు పేరు బ్ర‌యాన్‌. 20 సంవ‌త్స‌రాల క్రితం 81 కిలోల బ‌రువుండేవాడు. అప్ప‌టి బ‌రువు పెర‌గ‌డం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అత‌ను ఫ్యాట్ ఫెటిష్ స‌మాజంలో ఒక స‌భ్యుడు. ఇత‌ను బ‌రువు పెరుగ‌డంలో ఆనందం పొందుతాడు.

ఫ్లోరిడాకు చెందిన బ్ర‌యాన్‌కు చిన్న వ‌య‌సులోనే బ‌ల్క్ అప్ చేయాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది. ఆరేండ్ల వ‌య‌సులో కార్టూన్లు ఎక్కువ‌గా చూసేవాడు. వాటినే ఆద‌ర్శంగా తీసుకున్నాడు. బరువు పెరిగే బ్రయాన్ స్వలింగ సంఘంలో ఉపసంస్కృతిలో భాగం. ఎల్‌జీబీటీక్యూప్ల‌స్ సంఘానికే ప‌రిమితం కాదు. బ్ర‌యాన్ రోజువారి ఆహారానికి కావాల్సిన డ‌బ్బును అభిమానుల‌ను అర్జిస్తాడు. చందాదారులు అత‌ని కంటెంట్‌ను చూసేందుకు నెల‌కు 20 డాల‌ర్లు చెల్లిస్తారు. బ్ర‌యాన్‌కు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా ఉంది. త‌న‌కు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేస్తూ ఉంటాడు. బ‌రువు పెర‌గ‌డం ఒక్క‌రోజులో అయ్యేది కాదు. దీనికి చాలారోజులే ప‌డుతుంది. పెద్ద స‌వాల్‌తో కూడుకున్న ప‌ని అంటున్నాడు బ్ర‌యాన్‌. కానీ ప్ర‌తిరోజూ అధికంగా కేల‌రీలు తీసుకోవ‌డం ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంద‌ని తెలుసుకోవాలంటున్నారు నెటిజ‌న్లు. 

 

  

View this post on Instagram

Chowing down on Chipotle burritos again. #gainerbull

A post shared by Gainerbull (@gainer_bull) on


logo