ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Sep 08, 2020 , 12:55:39

వామ్మో.. అత‌ని పురీషనాళంలో బీర్‌గ్లాస్‌.. షాక్ అయిన వైద్యులు!

వామ్మో.. అత‌ని పురీషనాళంలో బీర్‌గ్లాస్‌.. షాక్ అయిన వైద్యులు!

గ‌త కొన్ని నెల‌లుగా చైనాలో విచిత్ర‌మైన కేసులు చోటు చేసుకుంటున్నాయి. పోయిన నెల‌లో ఓ వ్య‌క్తి మెద‌డులో 5 అంగుళాల పొడ‌వున్న పురుగును వైద్యులు తొలిగించారు. త‌ర్వాత ఓ మ‌హిళ కొన్నిరోజుల నుంచి తీవ్ర‌మైన త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతుంటే స్కాన్ చేయ‌గా మెద‌డులో 6 అంగుళాల పురుగును గుర్తించి తొలిగించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇటీవ‌ల బ‌య‌ట‌ప‌డ్డ కేసులో పురుగులు లేవు. ఏకంగా బీర్‌గ్లాస్ తార‌స‌ప‌డింది.

ఓ వ్య‌క్తి పురీషనాళంలో లో బీర్‌గ్లాస్‌ను గుర్తించారు వైద్యులు.  ప్రొఫెసర్ లి వుషెంగ్, అతని వైద్యుల బృందం ఎక్స్-రే ద్వారా 6 సెం.మీ. పొడవు, 5.6 సెం.మీ వ్యాసంతో ఉన్న బీర్‌గ్లాసును గుర్తించారు. చైనీస్ మెడిసిన్ హాస్పిట‌ల్‌లో చికిత్స చేసి అత‌ని పురీషనాళం  నుంచి బీర్‌గ్లాస్‌ను తొలిగించారు వైద్యులు. ఆ ఆప‌రేష‌న్ వ‌ల్ల అత‌నికి ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వ్వ‌లేదు. అయితే, ఈ రోగి వివ‌రాలేమీ వైద్యులు వెల్ల‌డించ‌లేదు. కానీ ఆ బీర్‌గ్లాస్ అత‌ని పురీషనాళంలోకి ఎలా వెళ్లిందో ఇప్ప‌టికీ వైద్యుల‌కు అంతుప‌ట్ట‌డం లేదు. 


logo