గురువారం 29 అక్టోబర్ 2020
International - Sep 24, 2020 , 13:17:03

షేర్వానీ ధ‌రించిన పిల్లి.. పెళ్లికి రెడీ అయిన‌ట్లే!

షేర్వానీ ధ‌రించిన పిల్లి.. పెళ్లికి రెడీ అయిన‌ట్లే!

పెంపుడు జంతువులు వారి కుటుంబంలో ఒక‌టిగా మారిపోయాయి. మ‌నుషుల‌కు ఇచ్చే విలువ పెట్స్‌కూ ఇస్తున్నారు. వారు తినే తిండి నుంచి వేసుకునే బ‌ట్ట‌లు వ‌ర‌కు అన్ని సౌక‌ర్యాలు పెట్స్‌కు అందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఒక య‌జ‌మాని ఎంతో ఇష్టంగా పెంచుకునే పిల్లికి షేర్వాని కుట్టింది. ఈ దుస్తుల్లో పిల్లిని చూస్తుంటే పెళ్లికి రెడీ అయిన‌ట్లు క‌నిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది.

ఇలాంటి ఫోటోలు ఇప్ప‌టివ‌ర‌కు చాలానే చూసి ఉంటారు. అయినా నెటిజ‌న్లు ఈ ఫోటోను చూసి ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఫోటోను చూసి కొంత‌మంది నెటిజ‌న్లు త‌మ పెట్స్‌కు ధ‌రించిన దుస్తుల ఫోటోల‌ను రీట్వీట్ చేశారు. షేర్వానీలో ఎలా ఉందో చూడండి ఒక‌సారి.