సోమవారం 25 మే 2020
International - Apr 02, 2020 , 11:03:16

చైనాలో పిల్లులు, కుక్కల మాంసంపై నిషేధం

చైనాలో పిల్లులు, కుక్కల మాంసంపై నిషేధం

హైదరాబాద్‌ : చైనాలో కరోనా వైరస్‌ ప్రబలి ఇప్పటికే 3 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 81 వేల మందికి పైగా ఈ వైరస్‌ బారిన పడ్డారు. చైనా నుంచి సుమారు 203 ప్రపంచ దేశాలకు కరోనా వైరస్‌ విస్తరించింది. కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో చైనాలోని షెన్‌జెన్‌ సిటీలో పిల్లులు, కుక్కల విక్రయంపై నిషేధం విధించింది. మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త చట్టం ప్రకారం కుక్కలు, పిల్లులు, బల్లులు, పాములతో పాటు రక్షిత వన్యప్రాణులకు తినడాన్ని నిషేధించారు. పాములు, బల్లులు, పిల్లులు, కుక్కలతో సహా రక్షిత వన్యప్రాణుల పెంపకం, విక్రయం, వినియోగంపై షెన్‌జెన్‌లో నిషేధం విధించడం ఇదే తొలిసారి. 

పెంపుడు జంతువులుగా కుక్కలు, పిల్లులు ఇతర జంతువులతో పోలిస్తే మానవులతో సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకుంటాయి. కుక్కలు, పిల్లులు మరియు ఇతర పెంపుడు జంతువుల వినియోగాన్ని అభివృద్ధి చెందిన హాంగ్‌కాంగ్‌, తైవాన్‌ దేశాల్లో ఇప్పటికే నిషేధించారు. చైనాలోని వుహాన్‌ నగరంలోని జంతువధ శాల కేంద్రంగా 2019, డిసెంబర్‌ నెలలో కరోనా వైరస్‌ ప్రబలిన విషయం తెలిసిందే. కొత్తగా రూపొందించిన చట్టం నుంచి పందులు, ఆవులు, గొర్రెలు, గాడిదలు, కుందేళ్లు, కోళ్లు, బాతులు, పావురాలు, పిట్టలకు నిషేధం నుంచి మినహాయించారు. 

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చైనా ప్రభుత్వం ఫిబ్రవరిలో అడవి జంతువుల అమ్మకం మరియు వినియోగంపై శాశ్వత నిషేధాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఏదేమైనప్పటికీ చైనాతో పాటు వుహాన్ నగరంలో ఇప్పుడు అడవి జంతువులను విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని జంతు మార్కెట్లు కూడా తెరవబడ్డాయి. 


logo