బుధవారం 03 జూన్ 2020
International - Apr 06, 2020 , 12:56:07

పార్కులో గొర్రెల మంద సరదా షికార్లు

పార్కులో గొర్రెల మంద సరదా షికార్లు

హైదరాబాద్: బ్రిటన్ లో పార్కుల్లో మనషులు తిరగడాన్ని అధికారులు ఏమాత్రం ప్రోత్సహించడం లేదు. గాలికోసమని, సన్‌బాత్‌లని వచ్చి గడ్డిమీద గుంపులుగా వాలిపోవడం వల్ల కరోనా వ్యాపిస్తుందనే భయంతో జనాలను దూరం పెట్టారు. దాంతో పార్కులు బోసిపోతున్నాయి. వాటిని అలా వదిలేయడం ఇష్టం లేకనో ఏమో ఎక్కడి నుంచో ఓ గొర్రెల మంద పార్కులో దూరింది. మనుషులు బందీలైపోగా మూగజీవాలకు స్వేచ్ఛ లభించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక జనావాసాల్లో వన్యప్రాణులు సంచరిస్తున్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో బ్రిటన్‌లోని లాంకషైర్‌లో పబ్లిక్ పార్కులో గొర్రెల మంద సందడి చేసింది. డెబ్బీ ఎల్లిస్ అనే మహిళ ఈ దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. గొర్రెలు పార్కులో వాహ్యళికి రావడమే కాకుండా మెర్రీగోరొండ్‌లో కాసేపు సరదాగా చక్కర్లు కొట్టాయి. ఏప్రిల్ 2న విడుదల చేసిన ఈ వీడియో 14,000 షేర్లు, 2,300 రియాక్షన్లు తన ఖాతాలో వేసుకుంది. పార్కులు మూత పడ్డాయేమోనని తెగ బెంగ పడ్డాను.. కానీ పరవా లేదు ఇప్పుడు నా మనసు కుదుటపడింది అని ఓ ఫేస్‌బుక్ యూజర్ జోక్ చేశారు.

https://www.facebook.com/100004322918531/videos/1566894146798001/


logo