బుధవారం 24 ఫిబ్రవరి 2021
International - Jan 23, 2021 , 13:19:56

క్యాపిట‌ల్ హిల్‌కు జెట్‌లో వెళ్లింది.. ఇప్పుడు లీగ‌ల్ ఫీజుల కోసం వేడుకుంటోంది !

క్యాపిట‌ల్ హిల్‌కు జెట్‌లో వెళ్లింది.. ఇప్పుడు లీగ‌ల్ ఫీజుల కోసం వేడుకుంటోంది !

వాషింగ్ట‌న్‌:  ఈమె పేరు జెన్నా ర్యాన్‌.  ట్రంప్ వీరాభిమాని.  టెక్సాస్‌కు చెందిన రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్ ఈమె. వ‌య‌సు 50 ఏళ్లు. ఈమె ఇప్పుడు చిక్కుల్లో ప‌డ్డారు. క్యాపిట‌ల్ హిల్‌పై జ‌రిగిన దాడిలో ఆమె పాల్గొన్నది. స్వంత రాష్ట్రం నుంచి ప్ర‌త్యేక జెట్ విమానంలో వెళ్లిన‌ జెన్నా.. దానికి సంబంధించిన వీడియోల‌ను కూడా త‌న సోస‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసింది. జ‌న‌వ‌రి ఆర‌వ తేదీన‌ క్యాపిట‌ల్ హిల్ భ‌వ‌నంలోకి ప్ర‌వేశించిన ఫోటోలు, వీడియోల‌ను కూడా ఆమె అప్‌డేట్ చేసింది. ఆ పోస్టులు కాస్తా వైర‌ల్ అయ్యాయి.  అంతా బాగానే ఉంది. కానీ ఆ వీడియోల ఆధారంగా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. క్యాపిట‌ల్ హిల్‌లోకి అక్ర‌మంగా ప్ర‌వేశించిన  వారిపై అమెరికా పోలీసులు కొర‌డా రుళిపిస్తున్నారు.  దానిలో భాగంగానే జెన్నాను కూడా అదుపులోకి తీసుకున్నారు.  ట్రంప్ మీటింగ్ కోసం ఎంతో ఉత్సాహాంగా వాషింగ్ట‌న్ వ‌చ్చిన జెన్నాను పోలీసులు క‌స్ట‌డీలోకి తీసుకోవ‌డంతో ఆమె రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం డీలా ప‌డింది. 

ఆమె ఏజెన్సీ లైసెన్సు ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ పెరిగింది.  దీంతో ఆమె క‌ష్టాలు మ‌రింత పెరిగాయి.  అయితే ట్రంప్ వెళ్తూ వెళ్తూ సుమారు 70 మందికి క్ష‌మాభిక్ష పెట్టారు.  జెన్నా కూడా త‌న‌కు ట్రంప్ క్ష‌మాభిక్ష పెడుతార‌ని ఆశించింది. కానీ ఆమె ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లుతూ ట్రంప్ ఫ్లోరిడా వెళ్లిపోయారు.  పోలీసుల క‌స్ట‌డీలో ఉన్న జెన్నా.. భ‌యంతో త‌న సోష‌ల్ మీడియా పోస్టుల‌న్నీ డిలీట్ చేసింది. అయినా పోలీసులు ఆమెను వ‌ద‌ల‌లేదు. ఇప్పుడు త‌న న్యాయ కేసును వాదించేందుకు విరాళాలు కావాలంటూ ఆమె త‌న ఫాలోవ‌ర్ల‌ను వేడుకుంటున్న‌ది.  త‌న అరెస్టుతో న‌ష్టం వ‌చ్చింద‌ని, ఇక కేసును వాదించేందుకు న్యాయ‌వాదుల‌కు ఫీజు ఇవ్వాల‌ని, దాని కోసం డ‌బ్బులు పంపించాలంటూ ఆమె త‌న సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్ల‌ను కోరుతున్న‌ది.  క్యాపిట‌ల్ అటాక్‌తో హంగామా చేసిన జెన్నా.. ఇప్పుడు లీగ‌ల్ ఫీజుల కోసం తెగ తంటాలు ప‌డాల్సి వ‌స్తున్న‌ది.

VIDEOS

logo