మంగళవారం 31 మార్చి 2020
International - Feb 11, 2020 , 12:52:18

ఇరాన్ దాడి.. పెరుగుతున్న అమెరికా సైనికుల ట్రామా కేసులు

ఇరాన్ దాడి.. పెరుగుతున్న అమెరికా సైనికుల ట్రామా కేసులు

హైద‌రాబాద్‌:  జ‌న‌ర‌ల్ సులేమానీని అమెరికా హ‌త్య చేసిన నేప‌థ్యంలో.. ఇరాక్‌లో ఉన్న అగ్ర‌దేశ స్థావ‌రాల‌పై ఇరాన్ దాడి చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ దాడి వ‌ల్ల సుమారు 109 మంది సైనికులు ట్రామాకు గురైన‌ట్లు పెంట‌గాన్ పేర్కొన్న‌ది. గ‌తంలో 64 మంది మాత్ర‌మే గాయ‌ప‌డిన‌ట్లు చెప్పిన పెంట‌గాన్ ఇప్పుడు ఆ సంఖ్య‌ను రెండింత‌లు పెంచింది. వాస్త‌వానికి ఆ దాడి త‌ర్వాత ఎవ‌రికీ ఎటువంటి గాయాలు కాలేద‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజూరీతో బాధ‌ప‌డుతున్న వారిలో మ‌ళ్లీ 70 శాతం మంది సైనికులు విధుల్లో చేరిన‌ట్లు పెంట‌గాన్ చెప్పింది.  భారీ పేలుళ్ల వ‌ల్ల క‌లిగే శ‌బ్ధ పీడ‌నంతో.. సైనికుల చ‌వులకు చిల్లులుప‌డే అవ‌కాశాలు ఉంటాయి. దాని ద్వారా త‌ల‌కు సంబంధించిన అనేక రుగ్మ‌త‌లు వ‌చ్చే ఛాన్సు ఉంటుంది. గ‌త 20 ఏళ్ల‌లో అమెరికా సైన్యంలో సుమారు 4 ల‌క్ష‌ల టీబీఐ కేసులు న‌మోదు అయ్యాయి. 


logo
>>>>>>