శనివారం 30 మే 2020
International - May 19, 2020 , 12:15:12

2021 చివరి వరకు క్రూయిజ్‌ షిప్‌లపై సీషెల్స్‌ నిషేధం

2021 చివరి వరకు క్రూయిజ్‌ షిప్‌లపై సీషెల్స్‌ నిషేధం

హైదరాబాద్‌: పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సీషెల్స్‌ కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి క్రూయిజ్‌ షిప్‌లపై నిషేధం విధించింది. 2021 చివరి వరకు ఇది అమల్లో ఉంటుందని తెలిపింది. తూర్పు ఆఫ్రికాలోని ఈ ద్వీపదేశం వచ్చే ఏడాది చివరి వరకు తమ దేశంలోకి పర్యాటకులతో కూడిన క్రూయిజ్‌ నౌకలు రావడానికి వీల్లేదని పర్యాటక శాఖ మంత్రి డిడియర్‌ డాగ్లే ప్రకటించారు. విలాసవంతమైన ప్రైవేట్‌ విల్లాలకు నిలయమైన సీషెల్స్‌ చాలా మంది ప్రముఖులకు గమ్యస్థానంగా ఉన్నది. కాగా, పర్యాటకులు విమానాల్లో రావచ్చని ప్రకటించింది. 


logo