బుధవారం 03 జూన్ 2020
International - May 02, 2020 , 09:20:44

డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్‌పై లైంగిక ఆరోపణలు

డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్‌పై లైంగిక ఆరోపణలు

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతున్న త‌రుణంలో మాజీ ఉపాధ్యక్షుడు, డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్‌పై లైంగిక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ స‌మయంలో అత‌నిపై ఇలాంటి ఆరోప‌ణ‌లు రావ‌డం క‌ల‌క‌లం రేగింది. ఎన్నికలకు సిద్ధమవుతున్న బిడెన్‌కు ఇది కొంత ఎదురుదెబ్బేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సెనేట్ మాజీ స్టాఫర్ తారా రీడే లైంగిక ఆరోపణలుచేసింది. 1990లలో బిడెన్ పలుమార్లు తనను లైంగికంగా వేధించారని రీడే ఆరోపించగా.. బిడెన్ మాత్రం ఈ ఆరోపణలను బిడెన్ కొట్టిపడేశారు. ఆమె ఆరోపణల్లో నిజం లేదని, తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు జరుగుతున్న కుట్రలో ఇది భాగమని పేర్కొన్నారు. logo