శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Sep 06, 2020 , 13:33:13

బ్రిటన్‌లో కొందరిపై కత్తులతో దాడి

బ్రిటన్‌లో కొందరిపై కత్తులతో దాడి

లండన్: బ్రిటన్‌లో కత్తిపోట్ల కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరిపై కత్తులతో దాడులు చేశారు. బర్మింగ్‌హామ్ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. ఆర్కాడియన్, స్నోహిల్ ప్రాంతాల్లో కత్తిపోట్లు జరిగినట్లు తమకు ఫిర్యాదులు అందాయని వెస్ట్ మిడ్లాండ్స్ పోలీసులు తెలిపారు. వెంటనే అక్కడికి అత్యవసర వైద్య బృందాలను పంపి గాయపడిన వారికి చికిత్స అందజేసినట్లు చెప్పారు. తొలుత అర్థరాత్రి దాటిన తర్వాత బర్మింగ్‌హామ్ నగరం సెంటర్‌లో కత్తిపోటు ఘటన జరిగిందని అనంతరం ఆ ప్రాంతంలో పలుచోట్ల ఇలాంటి దాడులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించారు. ఇది చాలా దారుణ ఘటన అని అభివర్ణించారు. అయితే కత్తిపోట్లకు కారణం ఏమిటి, ఎవరు పాల్పడ్డారు అన్నది తెలియరాలేదు.

 లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo