మంగళవారం 02 జూన్ 2020
International - Apr 12, 2020 , 13:57:30

నోవెల్ క‌రోనా.. వందేళ్లు దాటిన ఏడు మంది కోలుకున్నారు

నోవెల్ క‌రోనా.. వందేళ్లు దాటిన ఏడు మంది కోలుకున్నారు

హైద‌రాబాద్‌:  గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లోనే చైనాలోని వుహాన్‌లో నోవెల్ క‌రోనా వైర‌స్ సంక్ర‌మ‌ణ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ఆ త‌ర్వాత కేసులు పెర‌గ‌డంతో.. ఆ న‌గ‌రాన్ని లాక్‌డౌన్ చేశారు. హుబేయ్ ప్రావిన్సులో ఉన్న వుహాన్ న‌గ‌ర‌మే ఒక‌ర‌కంగా వైర‌స్‌కు కేంద్ర‌బిందువుగా మారింది. మార్చి 8వ తేదీన ఆ న‌గ‌రాన్ని మ‌ళ్లీ తెరిచారు.  అయితే ఈ వైర‌స్ వ‌ల్ల ఇప్ప‌టికీ ఎక్కువ‌గా వృద్దులే మ‌ర‌ణిస్తున్నారు.  మ‌హ‌మ్మారి వ‌ల్ల‌ వుహాన్‌లోనూ అనేక మంది వృద్ధులు చ‌నిపోయారు.  వుహాన్‌కు చెందిన వందేళ్లు దాటిన 8 మందిలో ఏడు మంది కోలుకున్న‌ట్లు చైనా జాతీయ ఆరోగ్య సంస్థ పేర్కొన్న‌ది.  ఆ న‌గ‌రానికి చెందిన 108 ఏళ్ల వ్య‌క్తి కూడా క‌రోనా నుంచి స‌జీవంగా బ‌య‌ట‌ప‌డిన‌ట్లు వెల్ల‌డించింది. వుహాన్‌లో 80 ఏళ్లు దాటిన సుమారు మూడువేల మంది వృద్ధుల‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. దాంట్లో 70 శాతం మంది రిక‌వ‌ర్ అయిన‌ట్లు ఆ దేశ ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది.


logo