గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Jul 16, 2020 , 11:08:55

టర్కీలో విమానం కూలి ఏడుగురు మృతి

టర్కీలో విమానం కూలి ఏడుగురు మృతి

ఇస్లాంబుల్ : పరిశీలక విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా అధికారులు మృతి చెందిన ఘటన టర్కీ దేశంలోని పర్వత ప్రాంతంలో జరిగింది.  టర్కీలోని పర్వత ప్రాంతంలో 2,200 అడుగుల ఎత్తులో ఉన్న విమానం ప్రమాదవశాత్తు పర్వతాలపై కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లతోపాటు ఏడుగురు భద్రతాధికారులు మరణించారు. ఈ ఘనటపై టర్కీ దేశ మంత్రి సులేమాన్ సోయలు మాట్లాడుతూ  ఈ విమాన ప్రమాదంపై తాము దర్యాప్తు చేస్తున్నామని  చెప్పారు.

విమానం బయలు దేరిన 13 నిమిషాలకే రాడార్ నుంచి ఆచూకీ లభించలేదు. టర్కీ భద్రతా బలగాలు కుర్షిదిస్టన్ పార్టీ వర్కర్ మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo