బుధవారం 21 అక్టోబర్ 2020
International - Oct 11, 2020 , 15:46:44

రాకెట్ దాడిలో ఏడుగురు మృతి.. 33 మందికి గాయాలు

రాకెట్ దాడిలో ఏడుగురు మృతి.. 33 మందికి గాయాలు

బాకు: ఆర్మేనియా, అజ‌ర్‌బైజాన్ దేశాల మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతున్న‌ది. ఆదివారం తెల్ల‌వారుజామున‌ అజ‌ర్‌బైజాన్‌లోని గంజా న‌గ‌రంపై ఆర్మేనియా రాకెట్ దాడికి పాల్ప‌డింది. ఈ దాడిలో గంజాలోని ఓ భ‌వ‌నం పూర్తిగా ధ్వంస‌మైంది. దాంతో ఆ భ‌వ‌నంలోని ఏడుగురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో 33 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురు చిన్నారులు కూడా ఉన్నారు. అజ‌ర్‌బైజాన్ విదేశాంగ శాఖ ఈ వివరాల‌ను వెల్ల‌డించింది. అయితే అజ‌ర్‌బైజాన్ ఆరోప‌ణ‌ల‌ను ఆర్మేనియా కొట్టిపారేసింది. కాగా, న‌గొర్నో క‌ర‌బ‌క్ విష‌య‌మై ఆర్మేనియా, అజ‌ర్‌బైజాన్ మ‌ధ్య గ‌త కొన్ని రోజులుగా యుద్ధం జ‌రుగుతున్న‌ది.         

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo