బుధవారం 30 సెప్టెంబర్ 2020
International - Aug 06, 2020 , 12:42:05

కీట‌కాలతో వైర‌స్‌.. చైనాలో ఏడు మంది మృతి

కీట‌కాలతో వైర‌స్‌.. చైనాలో ఏడు మంది మృతి

హైద‌రాబాద్‌: కీట‌కాలు కుడితే వ్యాపించే కొత్త త‌ర‌హా వ్యాధి ఇప్పుడు చైనాలో ప్ర‌బ‌లుతున్న‌ది. ఆ వ్యాధి వ‌ల్ల ఇప్ప‌టికే ఏడు మంది చ‌నిపోయారు. మ‌రో 60 మందికి సంక్ర‌మించింది. ఆ వైర‌స్ మ‌నుషుల నుంచి మ‌నుషుల‌కు కూడా వ్యాపిస్తుంద‌ని వైరాల‌జిస్టుల చెబుతున్నారు. ఈస్ట్ర‌న్ చైనాలోని జాంగ్సూ ప్రావిన్సులో 37 మంది ఎస్ఎఫ్‌టీఎస్ వైర‌స్ సంక్ర‌మించింది. అన్‌హూ ప్రావిన్సులో కూడా మ‌రో 23 మందికి ఈ వైర‌స్ సోకిన‌ట్లు తేల్చారు. జాంగ్సూలో ఓ మ‌హిళ‌ల‌కు వైర‌స్ వ‌ల్ల జ్వ‌రం, ద‌గ్గు లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. ల్యూకోసైట్లు, బ్ల‌డ్ ప్లేట్‌లెట్లు త‌గ్గిన‌ట్లు గుర్తించారు.   

ఎస్ఎఫ్‌టీఎస్ వైర‌స్ కొత్త‌దేమీ కాద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు.  2011లోనే ఆ వైర‌స్ ప్యాథోజెన్‌ను చైనా ఐసోలేట్ చేసింది.  ఆ ప్యాథోజెన్ బున్యావైర‌స్ కేట‌గిరీకి చెందుతుంద‌ని భావిస్తున్నారు. కీట‌కాలు కుట్ట‌కుండా చూసుకుంటే వ్యాధి వ్యాపించే అవ‌కాశాలు త‌క్కువ‌గానే ఉంటాయ‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. 

 

  


logo