ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Aug 23, 2020 , 18:00:59

రోడ్డు వెంట గనిలో బాంబు పేలుడు.. ఏడుగురు దుర్మరణం

రోడ్డు వెంట గనిలో బాంబు పేలుడు.. ఏడుగురు దుర్మరణం

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌ సెంట్రల్ ఘజ్ని ప్రావిన్స్‌లో ఆదివారం రోడ్డు వెంట గనిలో జరిగిన పేలుడులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు తెలిపారు. ఘజ్ని ప్రావిన్స్ జఘాతు జిల్లాలో ఉదయం 10 గంటలకు ఈ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి రోడ్డు వెంట వెళ్తున్న వాహనం తునాతునకలు అవడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పేలుళ్లకు తామే బాధ్యత వహిస్తున్నట్లు తాలిబాన్లతో సహా ఏ ఉగ్రవాద సంస్థ ఇంతవరకు ప్రకటించలేదు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo