శనివారం 06 జూన్ 2020
International - Apr 25, 2020 , 12:15:01

పాకిస్థాన్‌లో క‌రోనాతో డాక్ట‌ర్ మృతి

పాకిస్థాన్‌లో క‌రోనాతో డాక్ట‌ర్ మృతి

హైద‌రాబాద్‌: పాకిస్థాన్‌లో క‌రోనా వ‌ల్ల డాక్ట‌ర్ మృతిచెందాడు.  పెషావ‌ర్‌లోని హ‌య‌తాబాద్ మెడిక‌ల్ కాంప్లెక్స్ హాస్పిట‌ల్‌కు చెందిన సీనియ‌ర్ డాక్ట‌ర్ మొహ‌మ్మ‌ద్ జావెద్ చ‌నిపోయాడు.  ఈ విష‌యాన్ని హాస్పిట‌ల్ డైర‌క్ట‌ర్ షెహ‌జాద్ ఫైస‌ల్ తెలిపారు. ఆ హాస్పిట‌ల్‌లో ఈఎన్‌టీ స్పెష‌లిస్ట్‌గా డాక్ట‌ర్ జావెద్ చేస్తున్నారు. ఓ వారం క్రితం జావెద్‌కు వైర‌స్ సంక్ర‌మించింది. అత‌ను వారం నుంచి వెంటిలేట‌ర్‌పై ఉన్నాడు. క‌రోనా రోగుల‌కు చికిత్స అందిస్తున్న స‌మ‌యంలో అత‌నికి వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు తెలుస్తోంది.logo